అధిక్షేపము
ఫిబ్రవరి 21, 2022
అధిక్షేపము (adhikshepamu)
అర్థము
(విశేష్యము): నిందించుట; త్రోసిపుచ్చుట; బెదిరించుట; ఆక్షేపించుట
Meaning
(noun) : condemnation; insult; censure; oppose
వాడుక / Usage
ప్రభుత్వ విధానాలను కూలంకుషంగా విశ్లేషించి అధిక్షేపించే పత్రికలు కరువయ్యాయి.
Magazines which analyse and criticize the government policies are scant.
మెదడుకు మేత / Food for thought
గంగా నది మొదట ఒక దేవత. తర్వాత ఒక పడవల రస్తా. ఆ తర్వాత మన పొలాల్లోకి ప్రవహించే పంట కాలువ. నదులు కవులు భూగోళపు రక్తనాళాలు. నదులు ప్రవహిస్తాయి కవితల్లా పక్షులకోసం, పశువులకోసం, మనుషులకోసం. నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి. కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి.
-- గుంటూరు శేషేంద్ర శర్మ (అక్టోబర్ 20, 1927 - 2007)
Comments
Post a Comment