నిరాఘాటము

 

ఫిబ్రవరి 22, 2022

నిరాఘాటము (nir-āghāṭamu)

    అర్థము

   (విశేషణము):  అఘాటము(అగడ్త/కందకం)చే అవరోధించబడనిది; మేర/హద్దు/అడ్డు లేనిది

   Meaning

   (adj) : unobstructed; boundless; without hesitation

   వాడుక / Usage

 సామజిక మాధ్యమాల ద్వారా మతోన్మాదం నిరాఘాటంగా వ్యాపిస్తోంది.
 Religious fanaticism is spreading unobstructed via Social Media.

   మెదడుకు మేత / Food for thought


వానల్లు కురవాలి వాన దేవుడా
వరిచేలు పండాలి వాన దేవుడా
నల్లనీ మేఘాలు వాన దేవుడా
చల్లగా కురవాలి వాన దేవుడా
మా ఊరి చెరువంత వాన దేవుడా
ముంచెత్తి పోవాలి వాన దేవుడా
కప్పలకు పెండ్లిళ్ళు వాన దేవుడా
గొప్పగా చేస్తాము వాన దేవుడా
పచ్చగా చేలంత వాన దేవుడా
పంటల్లు పండాలి వాన దేవుడా 
వానల్లు కురవాలి వాన దేవుడా 
వరిచేలు పండాలి వాన దేవుడా

        -- పిల్లల పాటలు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి