ఒజ్జ

 

ఫిబ్రవరి 24, 2022

ఒజ్జ (ojja)

    అర్థము

   (విశేష్యము - ఉర్దూ ఓజా నుండి): పురోహితుడు; గురువు; ఉపాధ్యాయులు; ఆదర్శప్రాయులు 

   Meaning

   (noun) : teacher; priest; role model

   వాడుక / Usage

     విద్యలకెల్ల ఒజ్జ బొజ్జ గణపతి.
     Ganapathi is the high priest and the ultimate preceptor of education.

   మెదడుకు మేత / Food for thought


ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ? ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ?  
తారీఖులు , దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకర్థం
నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం
నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం.
బలవంతులు దుర్భల జాతిని బానిసలను కావించారు
నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి .
రణరంగం కానీ చోటు భూ స్తలమంతా వెదకిన దొరకదు :
గతమంతా తడిసె రక్తమున , కాకుంటే కన్నీళ్లతో .
చెంగిజ్ ఖాన్ , తామర్లేనూ , నాదిర్షా , ఘజ్నీ , ఘోరీ ,
సికిందరో ఎవడైతేనేం ? ఒక్కక్కుడూ మహాహంతకుడు .
వైకింగులు , శ్వేత హూణులూ , సింధియన్లూ , పారశీకులు ,
పిండారులు , థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన .
అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్రాజ్యాలూ , నిర్మించిన కృత్తిమ చట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై :
పరస్పరం సంఘర్షించిన 
శక్తులలో చరిత్ర పుట్టెను . 

 

        -- మహాప్రస్థానం,  శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి