ఉభయభ్రష్టము

 

ఫిబ్రవరి 25, 2022

ఉభయభ్రష్టము (ubhayabhrashtamu)

    అర్థము

   (విశేషణము): ఉభయ=రెండు, ఇద్దరు; భ్రష్టము=(దిగ)జారిన; రెండు విధాల నష్టపోవడం; రెంటికి చెడ్డ రేవడు

   Meaning

   (adj) : losing on both things/sides/places; 

   వాడుక / Usage

     ఇటు స్వభాషను సరిగ్గా వాడలేక అటు ఆంగ్లములో అంతంత మాత్రం మాట్లాడి ఉభయభ్రష్టులం అయ్యాం.
     Not able to speak in our native language as well as struggling with English we have lost both.

   మెదడుకు మేత / Food for thought


మకరంద బిందు బృంద రస్యందన సుందరమగు మాతృభాషయే. . .
మహానంద కందళ సందోహ సంధానతుందిలమగు మాతృభాషయే. . .
నమ్రతకు నమ్రత, కఠినతకి కఠినత. . .
వదులునకు వదులు, బిగికి బిగి, జోరునకు జోరు...
ఎదురెక్కువకెదురెక్కువ, మందతకు మందత, ధాటికి ధాటి ...
అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని వగలు, అన్ని వద్దికలు...
అన్ని తళుకులు, అన్ని బెళుకులు, అన్ని హొయలు, అన్ని యొయ్యారములు. . .
కలిగిన మన మాతృ భాషయే! 
వ్యాసమునకు, ఉపన్యాసమునకు, కవిత్వమునకు, గానమునకు, గద్యమునకు. . .
సంపూర్ణార్హత గల భాషయే!! 
మనవారే దానినంత అధమాధమముగా చూచుట తగునా?

 

        -- స్వభాష (సాక్షి మూడో సంపుటి), పానుగంటి లక్ష్మీ నరసింహారావు (ఫిబ్రవరి 11, 1865 - 1940)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి