జంపు
ఫిబ్రవరి 03, 2022
జంపు (jampu)
అర్థము
(విశేష్యము): పొడుగు; నేతలో నిలువుపొడుగు; ఇంటి మధ్య కప్పు మోయు కఱ్ఱ; ఆలస్యం; గుంపు;
Meaning
(noun) : length/long; procrastination; central beam holding roof; group/crowd
వాడుక / Usage
ఆమె నల్లటి జంపు కురుల మోహంలో నన్ను నేను కోల్పోయాను.
I lost myself in the desire of her long black tresses.
మెదడుకు మేత / Food for thought
"రాయలసీమ వ్యవహారికం తెలియకుండా ప్రబంధాలు, కావ్యాలు చదవలేము." అని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఎందుకు అన్నారు? - రాయలసీమ వ్యావహారికం చదివితే ప్రబంధ సాహిత్యం చక్కగా తెలుస్తుందనే విషయానికి ఒక్క ముక్కలో సమాధానం చెప్పవచ్చు. ఆ ముక్క పేరు - అన్నమయ్య. అమ్మపాడే లాలిపాట దగ్గర్నిండీ వీథి లో వినబడే బూతుల వరకూ ఆయన పాటల్లో వినిపిస్తుందని తెలుగువారికి కొత్తగా చెప్పనక్కర్లేదు. అందులో సీమ వ్యావహారికం అడుగడుగునా కనిపిస్తుంది. ఈ విషయంపై ఎందరివో ప్రముఖుల వ్యాసాలు కనిపిస్తాయి. వేమన గురించీ చెప్పుకోవాలి. ప్రజాకవి వేమన లేకుండా తెలుగే లేదు. "ఉప్పు కప్పురంబు .." పద్యం చెప్పకుండా, నేర్వకుండా తెలుగు నేర్వడం అసాధ్యం అని చెప్పొచ్చు.
-- రవి (https://te.quora.com/రాయలసీమ-వ్యవహారికం)
Comments
Post a Comment