గోజు
ఫిబ్రవరి 04, 2022
గోజు (gōzu)
అర్థము
(విశేష్యము/క్రియ): బాధ; పీడ; జిగురు; అడిగి అడిగి విసిగించు; చాదస్తం
Meaning
(noun/verb) : harass; pester; sticky sap/gum; senility
వాడుక / Usage
స్వాతిముత్యంలో కమలహాసన్ ఉద్యోగం కోసం గోజు పెట్టాడు.
Kamalhasan pesters for a job in Swatimutyam.
మెదడుకు మేత / Food for thought
అచ్చట నొకప్డు కురిసె భాష్యాల జల్లు; విరిసె నట నాడు వేయంచు విచ్చుకత్తి.
ఇది గతించిన కథ; వినిపింతు నింక నేటి రాయలసీమ కన్నీటి పాట, కోటి గొంతుల
కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు. అదే పెన్న! అదే పెన్న!
నిదానించి నడు! విదారించు నెదన్, వట్టి ఎడారి తమ్ముడు! ఎదీ పెన్న? ఎదీ పెన్న?
ఎదీ పినాకినీ? ఇదే పెన్న! ఇదే పెన్న! ఇదే పినాకినీ! ఎదీ నీరు? ఎదీ హోరు?
ఎదీ నీటి జాలు? ఇదే నీరు! ఇదే హోరు! ఇదే ఇసుక వాలు! అదే పెన్న! అదే పెన్న!
కుండపోతల వానలు గుఱియ నేమి? పట్టుమని పదినాళ్ళలో పారబోసి,
ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పడుకొను నీ నేల దిన్నెమీద!-- పెన్నేటి పాట, విద్వాన్ విశ్వం (అక్టోబర్ 21, 1915 - 1987)
Comments
Post a Comment