ఆపన్నము

 

ఫిబ్రవరి 09, 2022

ఆపన్నము (āpannamu)

    అర్థము

   (విశేషణము):  ఆపదలో ఉన్నది; విపత్తు సంభవించినది; పొందబడినది, లభించినది 

   Meaning

   (adj) : afflicted; in trouble/danger; hapless; obtained, gained

   వాడుక / Usage

   కరోనా సమయంలో ఎందరో పేదలకు సోను సూద్ ఆపన్న హస్తం అందించారు.
   Sonu Sood extended a helping hand to the needy during Corona.

   మెదడుకు మేత / Food for thought


దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !
వెనుక చూసిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనుకేనోయ్ !
పూను స్పర్దను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !
చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయి !

-- గురజాడ అప్పారావు (సెప్టెంబర్ 21, 1862 - 1915)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి