బింకము

 

మార్చి  10, 2022

బింకము (binkamu)

    అర్థము

   (విశేష్యము): బిగువు; బెట్టు; గర్వము; నిక్కు

   Meaning

   (noun) : tight; tightness; stiffness; pride; arrogance

   వాడుక / Usage

    ప్రియ సఖుడిని గాలి కూడా దూరనంత బింకపు కౌగిలింతలో బంధించింది.
    She wrapped herself around her beloved tightly, so even air couldn't enter. 

   మెదడుకు మేత / Food for thought


    ఏం? ఏం లేదని?

    మనం చూడాలి గానీ
    ఊపిరి లేదా ఊహలు లేవా?
    నీకోసం నువ్వే లేవా?
    చీకటికి రంగులేసే కలలెన్నో
    నీ తోడై వస్తుండగా
    ఒంటరిగా లేవని
    ఆశకి కూడా ఆశని కలిగించేయ్!
    ఆయువనేది ఉండేవరకూ
    ఇంకేదో లేదని అనకు!

    ఒక్కో క్షణమూ ఈ బ్రతుకూ కొత్తదే నీకు!
    ఒక లైఫ్ ఒకటంటె ఒకటె లైఫ్ 
    ఇది కాదె అనుకుంటు వదిలేస్తె వేరె అవకాశం రాదె
    ఇది ఇంతె అనుకుంటే వందేళ్ళు నేడే జీవించె వీలుందే

    -- ఊపిరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి