సంకుమదము
మార్చి 11, 2022
సంకుమదము (sanku-madamu)
అర్థము
(విశేష్యము): సంకు=జవ్వాజి/పునుగు పిల్లి; మదము=కస్తూరి, రేతస్సు; సుగంధ ద్రవ్యం
Meaning
(noun) : civet; musk
వాడుక / Usage
రాస కేళిలో కలిగిన చెమటల పరిమళానికి సంకుమద సుగంధం తోడయ్యింది.
The musk added to the scent of sweat from ardent love making.
మెదడుకు మేత / Food for thought
జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ||
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ||
భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||
బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ||
సగినల మంచపు జాజర ||
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ||
భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||
బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ||
-- అన్నమయ్య (మే 22, 1408 - 1503)
Comments
Post a Comment