ఆణి
మార్చి 28, 2022
ఆణి (āṇi)
అర్థము
(విశేష్యము): ముత్యపు గుండ్రతనం; మర్మము; అంచు; ఎల్ల; చీల
Meaning
(noun) : spherical (pearl); secret; vital part; linchpin; edge; border
వాడుక / Usage
బండి చక్రం యొక్క ఆణి పడిపోగా బండి పక్కకి దొర్లిపోయింది.
The linchpin of the cart wheel came off and it rolled over.
మెదడుకు మేత / Food for thought
అలివెనీ ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో ఓ ఓ
జాలి నవ్వూ ఊ ఊ జాజి దండాలు
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో ఓ ఓ
జాలి నవ్వూ ఊ ఊ జాజి దండాలు
కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ నుదుట ముద్దు పెట్టనా ఆ ఆ బొట్టుగ
వద్దంటే ఒట్టుగ
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ అడుగు మాడుగులొత్తనా ఆ ఆ మెత్తగా
అవునంటే తప్పుగ
అవునంటే తప్పుగ
పొగరులేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ పొగడ దండలల్లుకొనా ఆ ఆ పూజ గా
పులకింతగల పూజ గా
పులకింతగల పూజ గా
తొలిరెమ్మల నోముకీ దొర నవ్వుల సామికీ చెలి మై నేనుండి పోనా ఆ ఆ చల్లగా
మరుమల్లెలు చల్లగా
మరుమల్లెలు చల్లగా
అలివెనీ ఆణిముత్యమా
నీ కంట నీటిముత్యమా
జాబిలి చలువో ఊ ఊ ఇది వెన్నెల కొలువో ఊ ఊ
స్వాతివాన లేత ఎండలో ఓ ఓ జాజి మల్లీ పూల గుండెలో ఓ ఓ
అలివెనీ ఆణిముత్యమా
అలివెనీ ఈ ఈ ఆణిముత్యమా
నీ కంట నీటిముత్యమా
జాబిలి చలువో ఊ ఊ ఇది వెన్నెల కొలువో ఊ ఊ
స్వాతివాన లేత ఎండలో ఓ ఓ జాజి మల్లీ పూల గుండెలో ఓ ఓ
అలివెనీ ఆణిముత్యమా
అలివెనీ ఈ ఈ ఆణిముత్యమా
-- ముద్ద మందారం, వేటూరి (జనవరి 29, 1936, 2010)
Comments
Post a Comment