తురుము

 

మార్చి  08, 2022

తురుము (turumu)

    అర్థము

   (విశేష్యము): కొప్పు; పొడుము; (క్రియ) : కొప్పులో పూలు పెట్టుకోవడం; చెక్కడం

   Meaning

   (noun) : coiffure; powder/dust; (verb) : grate/pound; deck flowers in hair

   వాడుక / Usage

    నువు పంపిన జాబుల పూలు నా సిగలో జాజులుగా తురమనా!
    Your letters sweet as flowers, bedeck shall I in my hair!

   మెదడుకు మేత / Food for thought


    సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
    మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
    ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
    మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు
    నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
    నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు
    జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
    చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
    మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
    మరలి రాలేవు నా చూపులు మధువుకై మెదలు తుమ్మెదలు

    -- మేఘసందేశం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి