మాతుల

 

మార్చి  24, 2022

మాతుల (mātula)

    అర్థము

   (విశేష్యము): మేనమామ లేక అతని భార్య; అత్త; ఉమ్మెత్త, దుత్తూరం; 

   Meaning

   (noun) : maternal uncle's wife; dattura flower

   వాడుక / Usage

    దశరథుడు రామ పట్టాభిషేకం తలపెట్టినప్పుడు భరతుడు మాతుల గృహంలో ఉన్నాడు.
    When Dasaratha decided on Rama's coronation, Bharatha was at his maternal uncle's home. 

   మెదడుకు మేత / Food for thought

    ఈనాటికీ మన చుట్టూ ఎంతోమంది తమ పేరు మరచిపోయిన శారదలు ఉన్నారు. భర్త పిల్లలు సంసారం తప్ప వేరే లోకం తెలిదు. అలాటి ఓ పేరు మరచిపోయిన శారదల్లో నేనూ ఒకదాన్నే మూడేళ్ల క్రిందవరకు.. పిల్లలకోసం నెట్ పరిచయం చేసుకుని సరదాకి బ్లాగు మొదలెట్టాను కాని కొంత కాలానికి అది కూడా బోర్ కొట్టింది. అప్పట్లో అసలు నాకు ఏమిష్టమో నాకే తెలిదు. సంపెంగలు ఇష్టం. రఫీఘంటసాల పాటలు ఇష్టం. వారపత్రికల్లో సీరియళ్లు,తెలుగు కథలు చదవడం ఇష్టం. పిల్లలు సెటిల్ అయ్యారు. ముందు ముందు పిల్లలు పెళ్లిళ్లు అయ్యాక వాళ్ల పిల్లలకు సేవలు చేస్తూ ఉండాల్సిందే..... మరి నా జీవితమంతా ఇంతేనా??.... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టి అల్లకల్లోలం చేసాయి. ఈ కథలోలాగే ఒక ఫ్రెండ్ మూలంగా నా గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బాధ్యతలను మానుకోలేదు కాని తగ్గించుకున్నాను. నాకు ఇష్టమైనది, నాకు తృప్తినిచ్చేది ఏంటీ అని ఆలోచించాను. ఆ దిశలో ప్రయానించి ఇదిగో ఇపుడు ఇలా ఉన్నాను మరి మీ చుట్టూ తమ పేరు మరచిపోయిన శారదలను ఎంతోమంది కనిపిస్తారు. వాళ్ళకు కూడా గుర్తు చేయండి. ఆ శారద మీరు కాకుంటే మీ అమ్మ కావొచ్చుపిన్ని కావొచ్చుఅక్క కావొచ్చు. అమ్మమ్మ కూడా కావొచ్చు.
-- జ్యోతి (http://jyothivalaboju.blogspot.com)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి