జాయా

 

మార్చి  25, 2022

జాయా (jāyā)

    అర్థము

   (విశేష్యము): మరో జన్మ ఇచ్చేది (సంతానం ద్వారా); భార్య;  

   Meaning

   (noun) : one who gives progeny; wife

   వాడుక / Usage
    అతడు జాయా సహితుడై ప్రేమయాత్రలకు వెళ్ళాడు.
    He went on honeymoon with his wife.

   మెదడుకు మేత / Food for thought

    మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, 
    అర్ధం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృత, జాగృత
    కామ క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరాః
    ఙ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత
    ఆశయాబధ్ధతే లోకా కర్మణా బహుచింతయా
     అయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత
    జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునహ్పునః
    సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత

    (తల్లి, తండ్రి , బంధువులూ సహోదరులూ, ధనమూ, గృహమూ అసత్యాలు. కామమూ, క్రోధమూ, లోభమూ అనేవి శరీరంలో తిష్ఠ వేసుకుని ఉండే దొంగలు. ఈ దొంగలు ఙ్ఞానమనే రత్నాన్ని దొంగిలించుకొని పోతాయి. ఈ లోకమంతా ఆశ అనే పాశంతో కట్టబడి ఉన్నవి. మన పనులూ బాధలలో ముణిగి, మన అయువు క్షీణిస్తున్నదనే తెలుసుకోము. మనిషి పుట్టుకే దుఖహేతువు, అట్లాగే ముసలితనమూ, భార్యా, మాటిమాటికీ జన్మజన్మకీ వచ్చే సంసారసాగరమూ ఇవన్నీదుఖహేతువులే. తెలుసుకో, మెళుకువగా ఉండు)

    -- శ్లోకచతుష్టయంఆది శంకరాచార్య 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి