ఆణిపోటు
మార్చి 30, 2022
ఆణిపోటు (āṇi-pōṭu)
అర్థము
(విశేష్యము): చావుదెబ్బ; ఆయువుపట్టు పై పొడిచిన పోటు; లోతైన గాయం
Meaning
(noun) : blow/cut/stab to the vitals; deep wound
వాడుక / Usage
మత రాజకీయాలు ప్రజాతంత్ర మనుగడపై ఆణిపోటు పొడిచాయి.
Religious politics have driven a stake through the very essence of democracy.
మెదడుకు మేత / Food for thought
ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్
మడువున గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్
మడువున గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
(ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలంబతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది.)
-- సుమతీ శతకం, బద్దెన (~ 1260)
Comments
Post a Comment