పరితాపము

 

ఏప్రిల్ 12, 2022

పరితాపము (pari-tāpamu)

    అర్థము

   (విశేష్యము): సంతాపం; భయం; కంపనం; జ్వరము

   Meaning

   (noun) :  pain; sorrow; affliction; fever; trembling

   వాడుక / Usage

     ప్రియురాలి ఎడబాటుతో పరితపించి యక్షుని శరీరం శుష్కించినది.
     Afflicted by the separation from his lover he was enervated.

   మెదడుకు మేత / Food for thought

  అద్భుత చారిత్రక ఘట్టాల లోన
    ఆస్థికులు నాస్తికులు మతాలు సిద్ధాంతాలు
    మనష్యుల్ని మరచి పరమ సత్యాలను తరచి పైకి తీసే
    ఆవేశపు మధ్యాన్నపు ఎండలలోన
    నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి
    సౌఖ్య నగరానికి దారి తెలియక
    సైను పోస్టు మీద మిధ్యాలిపి డిసైఫర్ చెయ్యలేక
    జిగీషువుల జిజ్ఞాసవుల ముఖాలు వెల వెల బోతున్న సమయాన
    అతగాడు ఒక్కడూ ఊపిరాడని గదిలో ఉరి పోసుకుని చని పోయాడు

    -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ (ఆగష్టు 01, 1921 - 1966)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి