కుతర్కము

 

ఏప్రిల్ 15, 2022

కుతర్కము (ku-tarkamu)

    అర్థము

   (విశేష్యము): తర్కము=వాదము/ఊహ/కారణము/హేతువు; కు=చెడు;  సహేతుకం కాని వాదం

   Meaning

   (noun) :  false logic; doubtful/incorrect reasoning; fallacy

   వాడుక / Usage

     వాట్సాప్ సమూహాలలో ఎన్నో కుతర్కమైన టపాలు, వాదనలు.
    WhatsApp groups have many posts and debates based on false logic/reasoning.

   మెదడుకు మేత / Food for thought

  నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే
    ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ
    దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
    బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్
    (1933-34 సం ల ప్రాంతంలో ఒకనాడు జాషువా వెంకటగిరి రాజైన యాచేంద్రభూపతిని సందర్శించటానికి రైల్లో వెళ్తున్నాడు. రైల్లో పరిచయమైన వ్యక్తి జాషువా కవి అని తెలుసుకొని అయన కవితలు విని ఎంతో సంతోషించాడు. జాషువాను ఎంతగానో అభినందించాడు. ఇంతలో ప్రసంగం కులంమీదకు మళ్లింది. జాషువాని ఆయన 'మీదే కుల'మని ప్రశ్నించాడు. జాషువా చెప్పాడు. అంతే అప్పటి వరకు జాషువాని పొడిగిన వ్యక్తే చివాలున లేచి వెళ్లిపోయాడు. గుండెను పిండే ఈ సంఘతననే జాషువా రాజుగారికి ఇలా చెప్పుకొని వాపోయాడు)
    -- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి