సౌరభము
ఏప్రిల్ 21, 2022
సౌరభము (saurabhamu)
అర్థము
(విశేష్యము): వాసన; పరిమళము; తావి; కుంకుమ; స్నేహము; ఎద్దు
Meaning
(noun) : odour; fragrance; saffron; friendship; bull
వాడుక / Usage
'సంగీత సౌరభము' శ్రీపాద పినాకపాణి రచించిన విశిష్టమైన సంగీతరచన.
The great musicologist Sripada Pinakapani authored 'Fragrance of Music'.
మెదడుకు మేత / Food for thought
అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంటతెస్తాడు.
ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళలో
ఆకాశచిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది.
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంటతెస్తాడు.
ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళలో
ఆకాశచిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది.
వద్దు..
నాకు వెన్నెలా వద్దు ,పున్నమీ వద్దు
సూర్యుడొక్కడే చాలు
అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ
నాకు వెన్నెలా వద్దు ,పున్నమీ వద్దు
సూర్యుడొక్కడే చాలు
అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ
--ఆకులు రాలు కాలం, మహెజబీన్
Comments
Post a Comment