పరితోషము
ఏప్రిల్ 22, 2022
పరితోషము (pari-tōshamu)
అర్థము
(విశేష్యము): మిక్కిలి సంతోషము; తృప్తి; హర్షము; వేడుక
Meaning
(noun) : pleasure; satisfaction; great joy
వాడుక / Usage
'జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ.'
Hail! the joyfully divine song of birds in all directions.
మెదడుకు మేత / Food for thought
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా
సాలేటి వానకి తుల్లింతా
ఇంకా సాలు సాలుకి నువ్వు బాలింతా
గాలినే ఉయ్యాలగా
నీళ్లనే చనుబాలుగా
పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు
సక్కంగా మోసేవు మొక్కల్లా
పరువమోచ్చి సేను వంగే
పైరు కాపు మేను పొంగే
పంట బిడ్డను రైతు బండికెత్తినంక
పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక
తల్లి నువ్వు నవ్వితె మాగాణి
ఎద తలుపు తీశావంటె సింగరేణి
తనువునె తవ్వి తీసిన
మనసునే తొలి చేసినా
పొట్ట తిప్పలకు బిడ్డలు
నీ పొట్టలో పడుతున్న తిప్పలు
ఏఏ రోజుకారోజు తీరి
నూరేళ్ళ అయ్యుస్సుకోరి
కడుపులో తిరిగేటి కొడుకుల కై నువ్వు
తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ
తైలాలు పూసింది నైలు నది
నీకు తలస్నానమయ్యింది గంగ నది
గంధమే పూసిందహో
పొందుగా ఓ యాంగుహో
కొండలల్లో రంగు రంగుపూలు
గండు కోయిలలు నైటింగేలూ
కొలువైనద వెండి కొండా
నీ జాలి గుండెల్లో జెండా
ఎన్ని ఉనన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
కనుల కనలేక కంపించి పోతావు
మాతల్లి నీ మట్టి బంగారం
అది మానవాళికి నుదుట సింధూరం
అమ్మా నీ అనురాగం
కమ్మనీ సమ భాగం
గొప్పలు తప్పులు చూడక
నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక
జన్మించినారా రాజులై
పేరొందినా నిరు పేదలై
నీవంటిపై సుతులు చితులకాల్చుకున్నా
నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మా
సాలేటి వానకి తుల్లింతా
ఇంకా సాలు సాలుకి నువ్వు బాలింతా
గాలినే ఉయ్యాలగా
నీళ్లనే చనుబాలుగా
పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు
సక్కంగా మోసేవు మొక్కల్లా
పరువమోచ్చి సేను వంగే
పైరు కాపు మేను పొంగే
పంట బిడ్డను రైతు బండికెత్తినంక
పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక
తల్లి నువ్వు నవ్వితె మాగాణి
ఎద తలుపు తీశావంటె సింగరేణి
తనువునె తవ్వి తీసిన
మనసునే తొలి చేసినా
పొట్ట తిప్పలకు బిడ్డలు
నీ పొట్టలో పడుతున్న తిప్పలు
ఏఏ రోజుకారోజు తీరి
నూరేళ్ళ అయ్యుస్సుకోరి
కడుపులో తిరిగేటి కొడుకుల కై నువ్వు
తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ
తైలాలు పూసింది నైలు నది
నీకు తలస్నానమయ్యింది గంగ నది
గంధమే పూసిందహో
పొందుగా ఓ యాంగుహో
కొండలల్లో రంగు రంగుపూలు
గండు కోయిలలు నైటింగేలూ
కొలువైనద వెండి కొండా
నీ జాలి గుండెల్లో జెండా
ఎన్ని ఉనన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
కనుల కనలేక కంపించి పోతావు
మాతల్లి నీ మట్టి బంగారం
అది మానవాళికి నుదుట సింధూరం
అమ్మా నీ అనురాగం
కమ్మనీ సమ భాగం
గొప్పలు తప్పులు చూడక
నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక
జన్మించినారా రాజులై
పేరొందినా నిరు పేదలై
నీవంటిపై సుతులు చితులకాల్చుకున్నా
నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా
-- సుద్దాల అశోక్ తేజ
Comments
Post a Comment