ఊర్ధ్వము
ఏప్రిల్ 25, 2022
ఊర్ధ్వము (ūrdhvamu)
అర్థము
(విశేషణము): మీద ఉన్నది; ఎత్తబడినది; పొడవైనది; ఆకాశము; దిక్చక్రమునకు లంబముగా పై నున్నది
Meaning
(adj) : above; high; elevation; erect
వాడుక / Usage
160కిమీ దూరం నుంచి త్రికోణమితిలోని ఊర్ధ్వ కోణం వాడి ఎవరెస్ట్ యొక్క ఎత్తు కనుగొన్నారు.
From a distance of 160 km, using angle of elevation, Everest's height was calculated.
మెదడుకు మేత / Food for thought
మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!
భృత్యః కుప్యతి నానుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే!అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్!
తస్మాదర్థముపార్జయ శ్రుణు సఖే హ్యర్థేన సర్వే వశాః!!
(ధన సంపాధన లేనివాడిని తల్లి తిడుతుంది. తండ్రి కూడా సంతోషించడు. అన్నదమ్ములు మాట్లాడరు. నౌకర్లు కూడా కోపగించుకుంటారు. కొడుకు వెంటరాడు. భార్యకూడా ప్రేమతో కౌగిలించుకోదు. ఆఖరుకు ప్రాణస్నేహితుడు కూడా తనను డబ్బు అడుగుతాడేమోనని అనుమానముతో పలకరించకుండా దూరంగా తప్పుకుని తిరుగుతాడు. కాబట్టీ ధనాన్ని సంపాదించు. ఆ ధనము వల్ల అందరూ నీ వశమవుతారు!)
-- భర్తృహరి సుభాషితం
Comments
Post a Comment