కలన
ఏప్రిల్ 27, 2022
కలన (kalana)
అర్థము
(విశేష్యము): తెలుసుకోవడం; పొందడం; జ్ఞానము; లెక్క పెట్టడం; చేయడం
Meaning
(noun) : comprehension; doing; making; counting; knowing
వాడుక / Usage
ష్రెక్ సినిమాలో కలన గణితం ఆధారంగా అతి సహజమైన కవళికలు సృష్టించారు.
The highly natural expressions in Shrek were produced using calculus.
మెదడుకు మేత / Food for thought
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా
ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా
అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా
రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా
-- అప్పు చేసి పప్పు కూడు, పింగళి నాగేంద్ర రావు(డిసెంబర్ 29, 1901 - 1971)
Comments
Post a Comment