ప్రమేయము

 

ఏప్రిల్ 28, 2022

ప్రమేయము (pra-mēyamu)

    అర్థము

   (విశేష్యము): సంబంధము; జోక్యం; యథార్థముగా తెలుసుకోదగినది; నిరూపించడానికి వీలయినది; రాసుల మధ్య సంబంధం

   Meaning

   (noun) :  that which can be known; subject; theorem; proposition; function (math)

   వాడుక / Usage

    పైథాగరస్ ప్రమేయం పైథాగరస్ కన్నా ముందు ఇతర ప్రాచీన సంస్కృతులకు తెలిసిన ఆధారాలు ఉన్నాయి.
     There is evidence that Pythagoras theorem was known by other ancient cultures.

   మెదడుకు మేత / Food for thought


      కడగి వట్టి యాస కడతేరనివ్వదు
    యిడుములందు బెట్టి యీడ్చుగాని
    పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు
    విశ్వదాభిరామ వినురవేమ
    (అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటేఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది )
    -- వేమన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి