విలోమము
ఏప్రిల్ 29, 2022
విలోమము (vilomamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): క్రమమునకు తలక్రిందైనది; అవరోహణ; కుక్క; పాము;
Meaning
(noun/adj) : reverse; inversely; dog; snake
వాడుక / Usage
రెండు శరీరాల మధ్య గురుత్వాకర్షణ శక్తిని వాటి దూరం యొక్క విలోమ చతురస్రంగా మారుతుంది.
The gravitational force between two objects varies inversely to the square of their distance.
మెదడుకు మేత / Food for thought
కమనీయ భూమిభాగములు లేకున్నవే; పడియుండుటకు దూది పణుపు లేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే; భోజనభాజన పుంజ మేల?
వల్కలాజినకుశావళులు లేకున్నవే; కట్ట దుకూల సంఘంబు లేల?
కొనకొని వసియింప గుహలు లేకున్నవే; ప్రాసాదసౌధాది పటల మేల?
(పడుకోడానికి చక్కటి నేల ఉండగా, దూది పరుపు లెందుకు?పుట్టుకతో వచ్చిన చేతులు ఉండగా, ఇంకా కంచాలు గరిటలు ఎందుకు? నారచీరలు జింకచర్మాలు ధర్భచాపలు ఉండగా, ఇంకా పట్టుబట్టలు అవి ఎందుకు? చక్కగా ఉండటానికి గుహలు ఉండగా, మేడలు భవనాలు ఎందుకు?)
--భాగవతం, పోతన (1450 - 1510)
Comments
Post a Comment