పోకడ
మే 10, 2022
పోకడ (pō-kaḍa)
అర్థము
(విశేష్యము): గతి; నడత; రీతి; ప్రవర్తనము; వాలకం; నాశనము
Meaning
(noun) : going; departure; behaviour; conduct; ruin
వాడుక / Usage
వాన రాకడ , ప్రాణం పోకడ ఎవరు చెప్పగలరు!
Who can predict the coming of rain or the going of life!
మెదడుకు మేత / Food for thought
నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో
నాలోని వేదనా నీ రూపు దాల్చెనా
నిను రూపుమాపగా విషమైన తాగనా
మంచిని చేసిన మానవుని వంచన చేసే లోకాన్ని
ఎదిరించి నిలవనా పోరాడి గెలవనా
వలపించు పూలతో మరిపించు మధువుతో
నా తనివి తీరగా నను నేనే మరువనా
-- నిండు మనసులు, దాశరథి (జులై 22, 1925 - 1987)
Comments
Post a Comment