నయగారము

 

మే 12, 2022

నయగారము (nayag-āramu)

    అర్థము

   (విశేష్యము): నయము+కారము; మృదుత్వము; మృదువైన మాటకారితనం; అనుకూలము; అలంకారం

   Meaning

   (noun) : smooth; softness; soft spoken; adorned; decoration

   వాడుక / Usage

   మేనక నయగారాలకు విశ్వామిత్రుని మనసు చలించింది.
   Viswamitra was enamoured with Menaka's endearments.

   మెదడుకు మేత / Food for thought

    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టీ లేపింది
    ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
    అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది

    వెలుగు దుస్తులేసుకొని సూరీడు
    తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
    పాడు చీకటికి ఎంత భయమేసిందో
    పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
    అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
    ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి

    పాలావెల్లిలాంటి మనుషులు
    పండు వెన్నెల వంటి మనసులు
    మల్లేపూల రాశివంటి మమతలు
    పల్లేసీమలో కోకొల్లలు
    అనురాగం... అభిమానం..
    అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
    ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు
    
-- ముత్యాల పల్లకీ, మల్లె మాల (ఆగష్టు 15, 1924 - 2011)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి