ప్రోచు
మే 13, 2022
ప్రోచు (prōchu)
అర్థము
(క్రియ): బ్రోచు; ఆదుకోను; కాపాడు; పోషించు; రక్షించు
Meaning
(verb) : nourish; protect; save; preserve
వాడుక / Usage
దేశాన్ని బ్రోచేవారెవరు, కులమత రాజకీయ చిచ్చు నుండి?
Who will protect the country from the flames of caste, religion and politics?
మెదడుకు మేత / Food for thought
ఎవరిరాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి
ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన
నీవే నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన
ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన
నీవే నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన
-- సిరివెన్నెల , సీతారామ శాస్త్రి (మే 20, 1955 - 2021)
Comments
Post a Comment