క్లేశము

 

మే 16, 2022

క్లేశము (klēṣamu)

    అర్థము

   (విశేష్యము): దుఃఖము; కోపము; బాధ; ఆపద; వ్యవసాయము

   Meaning

   (noun) : affliction; pain; suffering

   వాడుక / Usage

   పాండవులు అరణ్యవాసంలో అనేక క్లేశాలు అనుభవించారు.
   Pandavas endured a lot of suffering during their exile in the forest.

   మెదడుకు మేత / Food for thought

    శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
    హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం
    దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
    కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ 

    (భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!)

    -- భాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి