కేతువు

 

మే 17, 2022

కేతువు (kētuvu)

    అర్థము

   (విశేష్యము): గురుతు; అగ్ని; కాంతి; టెక్కెము; ధ్వజము; తోకచుక్క; నవగ్రహాలలో ఒకటి

   Meaning

   (noun) : symbol; fire; comet; flag; descending node of moon

   వాడుక / Usage

   మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జుని రథంపై కేతువుగా ఉన్నాడు.
   Hanuman stood as the standard on Arjuna's chariot in Mahabharata war.

   మెదడుకు మేత / Food for thought

    కవిత్వంలోనూ జీవితంలోనూ, Economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా. తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్‌, బహిర్‌ యుద్ధారావమే కవిత్వం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలు అంత అభిమానం. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు, మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవ లనిపిస్తుంది. ఎందుకంటే-
    --మహాప్రస్థానంకి యోగ్యతాపత్రం, చలం (మే 18, 1894 - 1979)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి