క్రోడీకరణము

 

మే 19, 2022

క్రోడీకరణము (krōḍi-karaṇamu)

    అర్థము

   (విశేషణము): ఓకటిగా చేర్చడం; ఆలింగనం; సంగ్రహము

   Meaning

   (noun) : embracing; abridgment; codification; putting things together

   వాడుక / Usage

   మహాభారతంలో క్రోడీకరించబడ్డ నీతులు తరతరాలకు నిలిచిపోయాయి.
   The moral precepts codified in Mahabharatha stand for all times.

   మెదడుకు మేత / Food for thought

    తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికే
    సరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె
    వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం
    కరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్

    (సంపద స్థిరముగా మనతో రాదు. ఉన్నవాడిని అని గర్వం అనవసరం. విధికి అతీతంగా పోలేము. కాలం అనుకూలమైనప్పుడు సేవకుడే రాజవ్వును, ప్రతికూలమైనప్పుడు రాజే సేవకుడవ్వును)
    -- సత్య హరిశ్చంద్ర, బలిజేపల్లి లక్ష్మీకాంతం (డిసెంబర్ 23, 1881 - 1953)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి