కవాటము
మే 20, 2022
కవాటము (kavāṭamu)
అర్థము
(విశేష్యము): తలుపు; ఒక వైపుకే తెరుచుకునే తలుపు (వాయు/ద్రవ పధార్థాలు వెనక్కి రాకుండా)
Meaning
(noun) : door; valve
వాడుక / Usage
మయసభలో కవాటములు ఉన్నచోట లేనట్లుగా, లేని చోట ఉన్నట్లుగా నిర్మించాడు.
Mayasabha was designed with doors appearing where they weren't and vice versa.
మెదడుకు మేత / Food for thought
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పలదుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
ఏవో జ్ఞాపకాల సుడిదాటి బైటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీ
జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచీ
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎపుడైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
పోయింది వెతికే వేదనా ఉంటుంది ఏదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి అలజడి నిలిచేదెపుడో
సందేహం కలిగే మదికి కలతను తీర్చేదెవరో
శాపంలాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా
-- అతిథి, సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)
Comments
Post a Comment