మహతి‌‌

 

మే 23, 2022

మహతి‌‌ (mahati)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): వంద తంత్రులు ఉన్న నారదుని వీణ; స్త్రీ వాచకం (వ్యాకరణం); గొప్పది 

   Meaning

   (noun/adj) : Narada's veena; feminine nouns in Telugu; great

   వాడుక / Usage

   తెలుగు పాటకి మునుపులేని మహతియైన ప్రతిష్ఠ వేటూరి మాటతో వచ్చింది.
   Veturi's words bestowed a great prestige to Telugu songs.

   మెదడుకు మేత / Food for thought

    నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
    తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
    నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
    బూదిపూతకు మారు పులితోలు వలువాయె
    ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
    తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
    ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
    కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

   -- కిరాతార్జునీయం (భక్త కన్నప్ప), వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి