గమకము

 

మే 24, 2022

గమకము (gamakamu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): ప్రయత్నం; అధికము; మిక్కిలి; కౌశలం; మనోహరం; తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడం

   Meaning

   (noun/adj) : endeavour; pleasant; increase; great; ornamented notes (music)

   వాడుక / Usage

   ప్రవరాఖ్యుని చూసి వరూధిని తమకం గమకమయ్యెను.
   Varudhini's desire increased on seeing Pravarakhya.

   మెదడుకు మేత / Food for thought

    సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత-
    చందమాయ చూడరమ్మ చందమామ పంట॥

    మునుప పాలవెల్లి మొలచి పండినపంట
    నినుపై దేవతలకు నిచ్చపంట
    గొనకొని హరికన్ను గొనచూపులపంట
    వినువీధి నెగడిన వెన్నెలల పంట॥

    వలరాజు పంపున వలపు విత్తిన పంట
    చలువై పున్నమనాటి జాజరపంట
    కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
    మలయుచు తమలోని మర్రిమాని పంట॥

    విరహుల గుండెలకు వెక్కసమైన పంట
    పరగచుక్కలరాసి భాగ్యము పంట
    అరుదై తూరుపుకొండ నారగబండినపంట
    యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥

   -- చందమామ పాటలు, అన్నమయ్య (మే 22, 1408 - 1503)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి