సుమరజం

 

మే 27, 2022

సుమరజం (sumarajamu)

    అర్థము

   (విశేష్యము): సుమ = పుష్పం; రజం = దుమ్ము, పుప్పొడి; కుసుమ పరాగం; పువ్వుల పొడి

   Meaning

   (noun) : pollen; flower dust

   వాడుక / Usage

    భరతమైన నాట్యం నటప్రకృతీ పాదజం  నర్తనమే శివకవచం  నటరాజ పాద సుమరజం.
    Dance of Bharata (country or sage) born at the feet of nature is the protection accorded by Shiva; it is the offering of flowers at Nataraja's feet.

   మెదడుకు మేత / Food for thought

    భారత దేశంలో సెక్కులర్ రాష్ట్రం గురించి మాట్లాడతాము. దానికి మన భాషలలో సరైన పదం దొరకడం చాలా కష్టం. కొంతమంది అదంటే మతానికి వ్యతిరేకం అనుకుంటారు. అది ససేమిరా నిజం కాదు. దాని అర్థం ఏమిటి అంటే - రాష్ట్రం అన్ని ధర్మాలని/మతాలని సమానంగా గౌరవిస్తుంది, పరిగణిస్తుంది, సమానమైన అవకాశలు ఇస్తుంది. రాష్ట్ర పరంగా ఒక మతానికే అధీనమై ఉండదు. చరిత్రలో తరచుగా కనపడేది ఏమిటి అంటే - మనల్ని మంచి వారిగా తీర్చిదిద్ది ఔన్నత్యం ఇవ్వాల్సిన మతం మనల్ని మృగాలుగా తయారు చేసింది. జ్ఞానాన్ని ప్రసాదించాల్సిన మతం అంధకారంలోకి నెట్టివేసింది. విశాల భావాలు ఇవ్వాల్సిన మతం ఇరుకు మూలలలో బంధించి ఇతర మతాలంటే  అసహనం/ద్వేషం కలుగచేసింది.

   --పండిట్ జవహర్ లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి