తేటి
మే 09, 2022
తేటి (tēṭi)
అర్థము
(విశేష్యము): తుమ్మెద; తేనెటీగ; భ్రమరము
Meaning
(noun) : black carpenter bee; honey bee
వాడుక / Usage
కీటకనాశన మందుల విచ్చలవిడి వాడకం వల్ల తేటుల సంఖ్య బాగా దెబ్బ తింది.
Indiscriminate use of pesticides has led to a precipitous fall of bee population.
మెదడుకు మేత / Food for thought
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో...
మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది
బాషలేనిది బందమున్నది మన ఇద్దరిని జత కూర్చినది...
వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది
ఎల్లలు యేవి వొల్లలన్నది నీదీ నాదోక లోకం అన్నది...
తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది
మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది
-- మరో చరిత్ర, ఆచార్య ఆత్రేయ (మే 7, 1921 - 1989)
Comments
Post a Comment