ధురంధరుడు
జూన్ 10, 2022
ధురంధరుడు (dhuran-dharuḍu)
అర్థము
(విశేష్యము): బరువు/భారం మోసేవాడు; నేర్పరి
Meaning
(noun) : one who bears a burden or responsibility; able person
వాడుక / Usage
సుఖదుఃఖాలలో ఒకే రీతిలో మసులుకునే ధురంధరుడు అతడు.
He showed equanimity through trials and triumphs.
మెదడుకు మేత / Food for thought
రంగా శ్రీరంగా నా మొర వినరా నీ దరిజేరుచుకోరా
దరిజేరుచుకోరా రంగా నా మొర వినరా శ్రీరంగాదరిజేరుచుకోరా రంగా
ఎరుగను వేదపురాణ రహస్యము
ఎరుగను నీ పద బాగుణ సేవ
తిరిగితిరిగి పెడదారులలో
తిరిగితిరిగి పెడదారులలో
నిజమెరిగి నిన్ను శరణంటినిరా
దరిజేరుచుకోరా రంగా నా మొర వినరా శ్రీరంగా
దరిజేరుచుకోరా రంగా
శరణటన్న కరిరాజును కావగ
పరుగున దూకిన శ్రీరంగా
శరణటన్న కరిరాజును కావగ
పరుగున దూకిన శ్రీరంగా
పరిహరించు నా భవభందముల
శరణాగత జనపాలా శ్రీరంగా శ్రీరంగా
--విప్రనారాయణ, సముద్రాల రాఘవాచార్య (జులై 19, 1902 - 1968)
Comments
Post a Comment