అజాతశత్రువు
జూన్ 22, 2022
అజాతశత్రువు (a-jāta-ṣatruvu)
అర్థము
(విశేష్యము):ధర్మరాజు, యుధిష్ఠిరుడు; శత్రువులు లేనివాడు; అజాత=పుట్టని, శత్రువు=విరోధి
Meaning
(noun) : Dharmaraja, Yudhistira; one who has no enemies
వాడుక / Usage
అజాతశత్రువుకు కోపం రావడమంటే నీళ్ళలో నిప్పు పుట్టటమే!
Dharmaraja getting angered is like fire emanating from water!
మెదడుకు మేత / Food for thought
నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారుగాన, బతుల విధమ కాక యే శైలూషి
గాననంగ రాదు కంక భట్ట
అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ.
మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది
(ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? పైగా నా భర్తగారు నటుడే కాదు పెద్ద జూదరి కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?"అంది ద్రౌపది)
--విరాట పర్వం, ఆంధ్ర మహాభారతం, తిక్కన సోమయాజి (1205 - 1288)
Comments
Post a Comment