ద్రోణ
జూన్ 23, 2022
ద్రోణ (drona)
అర్థము
(విశేష్యము): ద్రవం(నీళ్లు) ఉంచునది; కుండ; కుండ/కలశం లో పుట్టినవాడు; ద్రోణాచార్యుడు
Meaning
(noun) : pot; one born in a pot; Dronacharya
వాడుక / Usage
అశ్వత్థామ హతః (కుంజరః) అని ధర్మరాజు అనగా ద్రోణుడు అస్త్రత్యాగం చేసాడు.
On hearing Dharmaraja say "Ashwatthama (the elephant) is dead" Drona stopped fighting.
మెదడుకు మేత / Food for thought
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్ల రేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!
--జయభేరి, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment