వసుషేణుడు

 

జూన్ 24, 2022

వసుషేణుడు (vasushenudu)

    అర్థము

   (విశేష్యము): కర్ణుడు; వసు=బంగారం, సేన=విస్తారమైన; కుండల, కవచ, ధనరాశులతో దొరికినందున పెట్టిన పేరు

   Meaning

   (noun) : Karna; one found with lot of gold etc wealth 

   వాడుక / Usage

    వచ్చినవాడు ఇంద్రుడు అని తెలిసినా వసుషేణుడు కవచకుండలాలు దానం చేసాడు.
    In spite of knowing that it was Indra, Karna gave away his armour.

   మెదడుకు మేత / Food for thought

   సాగిపోవుటె బ్రతుకు
    ఆగిపోవుటె చావు
    సాగిపోదలచిన
    ఆగరాదిచటెపుడు
    ఆగిపోయిన ముందు
    సాగనే లేవెపుడు
    వేచియుండిన పోను
    నోచుకోనే లేవు.

    తొలగి తోవెవడిచ్చు
    త్రోసుకొని పోవలయు.
    బ్రతుకు పోరాటము
    పడకు ఆరాటము.

    బ్రతకదలచిన పోరు
    సుతరాం తప్పదు.
    చూపతలచిన జోరు
    రేపనుట ఒప్పదు.
    -- ప్రజాకవి కాళోజి (సెప్టెంబర్ 09, 1914 - 2002)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి