నాంది

 

జూన్ 27, 2022

నాంది (nāndi)

    అర్థము

   (విశేష్యము): పెద్దలు చేయు ఆశీర్వాదం; మంగళము; భేరి; ఒక కార్యక్రమానికి/పనికి తొలి ఘట్టం; ప్రారంభ సూచకం

   Meaning

   (noun) : benediction; prelude; beginning 

   వాడుక / Usage

    పౌర హక్కుల ఉల్లంఘనకు ఆ తీర్పు నాంది పలికింది. 
    That judgement is a prelude to the violation of civil rights.

   మెదడుకు మేత / Food for thought

   ఈ స్త్రీకి గోదావరికీ తేడా ఏముంది?
    అతి సాధారణమైన కుల కొండచరియల్లో పుట్టి, సన్నగా ప్రవహించి, విధి ఎత్తులున్న చోట మర్యాదగా ప్రక్కకు తొలగి, బలం పుంజుకుని కొండల్ని ఢీకొని, అడ్డంకుల్ని తొలగించుకుని, జీవనదై పదిమందికీ అన్నం పెట్టే గోదారి..! సాగర సంగమానికి సంతోషంగా వెళ్లబోతుంటే అడ్డుగా తన స్వార్థంతో ఆనకట్ట వేసిన మనిషిని కూడా చిరునవ్వుతో క్షమించే స్త్రీ ఈ గోదారి! వినగలిగితే ఆ గలగలల్లోంచే జీవితానికి స్ఫూర్తినిచ్చే వేదగోష వినపడుతుంది.
  ఆ నిశ్శబ్దస్వర నినాదాల శృతి నాస్వాదిస్తుండగా తాను దగ్గరగా వచ్చింది. ఆత్రముగా తలెత్తి చూసాను. నవ్వింది. ఆ నవ్వులో నాక్కావాల్సిన సమాధానం దొరికింది. నేనూ నవ్వాను. వెన్నెల్లో గోదారి కూడా.
    -- వెన్నెల్లో గోదారి,యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి