అతీతము

 

జూన్ 28, 2022

అతీతము (atītamu)

    అర్థము

   (విశేషణము): గడిచినది; కాలం మీరినది; చచ్చినది; అతిక్రమించినది; దాటి పోయినది

   Meaning

   (adj) : past; elapsed; extraordinary; wonderful 

   వాడుక / Usage

    మతోన్మాదుల కబంధ హస్తాలనుంచి దేశాన్ని కాపాడడానికి కాలాతీతమైంది.
    Time has run out to extricate the country from the vicious grip of religious fundamentalists.

   మెదడుకు మేత / Food for thought

   క్షణం పటాలున పగిలి విశ్వవాస్తవమైపోయింది. ఆకాశం భూమి మీదకు దిగిపోతోంది. నక్షత్రాలు మండి పోతున్నాయి. అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. కడలి ఇంకి పోయింది. బిగ్గరగా నవ్వాలనిపించింది. ఏడుపొచ్చింది. యుగయుగాలుగా పేరుకున్న ఆవేదన అంతా ఒక్క కన్నీటి చుక్క రూపంలో బయటకొచ్చింది. అమ్మా - ఎందుకు పడేశావమ్మా నన్నీ పాడులోకంలోకి? మూడు నిమిషాల ఆవేశానికి నువ్వు లొంగకుండా ఉంటే ఏ దేవుడికుందమ్మా నన్ను సృష్టించే శక్తి? ఎదుటి వ్యక్తుల మనసులో ఆలోచనల్ని చదవగలిగే భూతద్దం దేముడు నాకిస్తే ఇంత కల్మషాల్ని నీచాలని చూడలేక ఆత్మహత్య చేసుకోవడం ఖాయం. ఎందుకు బ్రతకటం? ఏది మిగిలేది చివరకి? ప్రశ్నే - సమాధానం లేదు. దొరకదు. ఎందుకీ వ్యధ?
    -- ఋషి, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి