చివుక్కు

 

జూన్ 29, 2022

చివుక్కు (chivukku)

    అర్థము

   (విశేష్యము): హఠాత్తుగా; ఎక్కటం, దాటడం, ఎగరడంలో ధ్వని; మనసు నొచ్చుకోడం

   Meaning

   (adv) : suddenly; briskly climbing/crossing/jumping; hurt mentally

   వాడుక / Usage

    ప్రియుని జాడ తెలియక ఆమె మనసు చివుక్కుమంది.
    Being in the dark about her beloveds whereabouts hurt her.

   మెదడుకు మేత / Food for thought

   ఒక నీటి చుక్క కనుచివర నుంచి చెక్కిలి మీదకు జారి నాతో అన్నది:
    "ప్రియతమా! ఇన్నాళ్లు నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయాను. ఎన్నో అనుభవాలు నీతో పంచుకుంటూ వచ్చాను. విషాదమైనా, ఆనందం మరీ ఎక్కువ అయినా బైటకి రావడానికి ప్రయత్నించాను. కానీ నిన్ను వదిలి మాత్రం వెళ్ళలేకపోయాను. స్నేహితుడా! ఈ రోజు నీ గుండెల్లో ఉబుకుతూన్న ఈ వేదనా తరంగం నన్ను కుదిపి వేస్తూంది. బైటకు తోసేస్తూంది. నేను కదిలి-కారి-జారి ఆవిరైపోతాను. నేనిలా వెళ్ళిపోవటం నీ మనసుకేమాత్రం ఊరటనిచ్చినా ...మిత్రమా - నా కంతకన్నా కావలసిందేముంది?"
    --వెన్నెల్లో ఆడపిల్ల, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి