ధనంజయన్యాయము

 

జూన్ 06, 2022

ధనంజయన్యాయము (dhanan-jaya-nyayamu)

    అర్థము

   (సూక్తి): చేసింది ఒకరైతే దాని పేరు ఇంకొకరికి రావడం; ధనంజయ=అర్జునుడు; కౌరవ నాశనానికి కృష్ణుడు కారణమైతే పేరు అర్జునుడికి వచ్చినట్లు

   Meaning

   (maxim) : getting credit for some one else's work

   వాడుక / Usage

    వెనకుండి నడిపించింది ఆమె, కానీ ధనంజయన్యాయంగా పేరు పై అధికారి కొట్టేసాడు.
    She was the one who worked behind the scenes, alas her superior got the honours.

   మెదడుకు మేత / Food for thought

   చల్లగాలిలో యమునాతటిపై
    శ్యామసుందరుని మురళి
    మురళి, శ్యామసుందరుని మురళి!
.
    ఉల్లము కొల్లగొనే మధుగీతులూ..ఆఅ.ఆఆఆ
    ఉల్లము కొల్లగొనే మధుగీతులు
    మెల్లమెల్ల చెవి సోకునవే
    చల్లగాలిలో...ఓ..ఓ..
    తూలి వ్రాలు వటపత్రమ్ములపై
    తేలి తేలి పడు అడుగులవే...ఏ.ఏ..
    పూలతీవ పొదరిల్లు మాటు గా
    పొంచిచూచు శిఖి పింఛమదే
    చల్లగాలిలో..ఓ..ఓ
    తరువు తరువు కడ డాగి డాగి
    నన్నరయు కన్నుగవ మురుపులవే
    మురిసి మురిసి, నా వెనుక దరిసి
    కనుమూయు చివురు కెంగేళులివే
    మూయు చివురు కెంగేళులివే
    చల్లగాలిలో..ఓ..ఓ
-- "శతపత్రసుందరి", డా.బాలాంత్రపు రజనీకాంతరావు (జనవరి 29, 1920 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి