ధావళి
జూన్ 07, 2022
ధావళి (dhaavali)
అర్థము
(విశేష్యము): మడికి ఉపయోగించు తెల్లని కంబళి/ధోవతి; ధవళ=తెల్ల
Meaning
(noun) : man's lower garment (typically used in rituals)
వాడుక / Usage
కాలం చక్రాల క్రింద నలిగిపోయిన అతని అవశేషాల ప్రతిరూపం ఆ ధావళి చిరుగులు.
His tattered garments are a testimony of the bad times that befell him.
మెదడుకు మేత / Food for thought
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలిరుసరుసలాడే చూపులలోనే
ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి ॥
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి
అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి ॥
మోహన మురళీ గానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి ॥
-- గుండమ్మ కథ, పింగళి నాగేంద్ర రావు (డిసెంబర్ 29, 1901 - 1971)
Comments
Post a Comment