కరభాస్థులు
జులై 11, 2022
కరభాస్థులు (karabha-asthulu)
అర్థము
(విశేష్యము): కరభ (మణికట్టు నుంచి చిటికెన వేలు మధ్య భాగం; అరచేయి) + ఆస్థులు (ఎముకలు); అరచేతి ఎముకలు
Meaning
(noun) : metacarpal bones
వాడుక / Usage
గోళ్లు గిట్టలుగా మారి భూమికి కరభాస్థులు అంటకుండా నడిచే వాటిని ఖురిత జంతువులంటారు.
Animals that walk on nails turned hoofs,without the metacarpal bones touching the ground, are called Ungulates.
మెదడుకు మేత / Food for thought
సార్నాథ్ బౌద్ధ స్థూపాన్ని ఆధారంగా తీసుకుని, మాండూక్య ఉపనిషత్లోని "సత్యమేవ జయతే" జోడించి జులై 22, 1947న భారత దేశ అధికార చిహ్నంగా నిర్ధారించారు. రాజ్యాంగ సభలో ఆ సందర్భంగా నాటి ప్రధాని నెహ్రు - "నేను అశోకుడిని ప్రస్తావించడానికి కారణం, అప్పటి మన స్వర్ణ చరిత్ర, ఇరుకైన జాతీయతతో సరిపెట్టుకోలేదు. అది మన అంతర్జాతీయతకు వన్నె తెచ్చిన కాలం. అశోకుని రాయబారులు దూర తీరాలకు వెళ్లారు. యుద్ధం కోసమో లేక సరిహద్దుల విస్తరణ కోసమో కాదు. శాంతి, సంస్కృతి, సహృద్రత పంచడానికి వెళ్లారు.
-- భారత దేశ అధికారిక చిహ్నం గురించి
Comments
Post a Comment