అవటువు

 

జులై 14, 2022

అవటువు (avaṭuvu)

    అర్థము

   (విశేష్యము): పెడతల; మెడ వెనుకటి భాగం/గుంట; ముచ్చిలి; నూయి; పల్లము

   Meaning

   (noun) : back/nape of neck; pit; well

   వాడుక / Usage

   పియూష గ్రంధి స్రవించే 'అవటుగ్రంధి ఉద్దీపన హార్మోన్' ధైరాక్సిన్ స్రావాన్ని క్రమపరుస్తుంది.
   Pituitary gland secretes Thyroid stimulating hormone to regulate Thyroxine.

   మెదడుకు మేత / Food for thought

   శ్వేతకేతు: భగవంతుడు సర్వాంతర్యామి అని మా గురువుగారు చెప్పారు.
    ఉద్దాలకుడు: కుమారా !సర్వవ్యాపకము అంటే ఏమిటి ?
    శ్వేతకేతు: తెలియదు నాన్నగారు.
    ఉద్దాలకుడు: కుమారా! నీవు లోపలికి వెళ్లి ఒక పాత్రలో నీరు. కొంచెం ఉప్పు తీసుకుని రా.
    (శ్వేతకేతు తండ్రి చెప్పినట్లే చేసాడు)
    ఉద్దాలకుడు: కుమారా! ఉప్పును ఆ నీటిలో బాగా కలుపు నోట్లో వేసుకొని చూడు.
    (శ్వేతకేతు అలానే చేసాడు)
    శ్వేతకేతు: ఉప్పగా వుంది నాన్నగారు.
    ఉద్దాలకుడు: పాత్రలో చెయ్యి పెట్టి ఉప్పు ను బయటికి తీయ్యి.
    (శ్వేతకేతు నీటిలో చెయ్యి పెట్టి చూసాడు)
    శ్వేతకేతునీటి లో ఉప్పు కరిగి పోయింది .ఉప్పుగా చిక్కదు .
    ఉద్దాలకుడు: నీ కేలా తెలిసింది?
    శ్వేతకేతు : పాత్రలోని నీరు ఉప్పగా ఉంది కదా.
    ఉద్దాలకుడు: మంచిది. నీవు అనుభవపూర్వకంగా ఉప్పు నీటిలో కలసి పోయిమ్దని తెలుసుకున్నావు. అదేవిధముగా భగవంతుడు ఈ సృష్టిలో     లీనమైనాడు. ఆ సత్యాన్ని అనుభవ పూర్వకంగానే తెలుసుకోవాలి .

    -- ఛాందోగ్యోపనిషత్తు, (http://laharicom.blogspot.com/2009/02/blog-post_26.html#.YtB_9VfMJD8)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి