కటి

 

జులై 15, 2022

కటి (kaṭi)

    అర్థము

   (విశేష్యము): మొల; నడుము; శ్రోణీ; పిప్పలి; వెళ్లి పోవుట

   Meaning

   (noun) : hip; haunch; pelvis; long pepper; to leave

   వాడుక / Usage

   కటి ప్రదేశంలోని ఎముకల వలయాన్ని శ్రోణి మేఖల అంటారు.
   The group of bones in the hip form the pelvic girdle.

   మెదడుకు మేత / Food for thought

   దేశం కాగితంలో  ప్రాంతాలు అడ్డగీట్లు,
   గీట్ల గట్లు నడుమ
   భాషలు ప్రవహిస్తాయి గంగలా, గౌతమిలా.
   అవతలి మాట అంటుకుంటుందని,
   ఇవతలి గట్టుకు ఉలికిపాటు.
   నీళ్ళకు లేని కుళ్ళు బుద్ధి గట్టు కెందుకున్నట్లు?
   శ్వాసలాంటిదే భాష.
   ఒంట్లో పుడుతుంది  ఊహలకు గొంతుకలు చుడుతుంది.
   మనిషినీ నేలనూ కలిపి కుడుతుంది.
   అక్షరాల పర్వతాలు పొంగించే
   ఆవేశం భాష.

    -- డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి