విహాయసము

 

జులై 18, 2022

విహాయసము (vihayasamu)

    అర్థము

   (విశేష్యము): ఆకాశం; అంతరిక్షం; విహంగం; పక్షి 

   Meaning

   (noun) : sky; space; bird

   వాడుక / Usage

   ప్రభాత విహాయసంలో పక్షుల కిలకిలా నాదాలు ఆమెను పులకింప చేశాయి.
   The bird songs in the morning sky warmed the cockles of her heart.

   మెదడుకు మేత / Food for thought

   ఒరేయ్ రాముడూ!….సుందర్రాముడూ.!! అలా ఉలిక్కిపడతావేంట్రా!!
    నేను నిన్ను ఒరేయ్ అని కాకుండా ఏమండీ అని పిలిస్తే ఆయుక్షీణం నాన్నా!
    నేనురా.. శారద నీరదేందు ఘనసారని…
    మరాళ మల్లికాహరని… తుషారఫేన రజతాచలకాశ
    ఫణీశకుందమందారని… సిత తామర సామర వాసినీ
    శుభకారని… చతుర్ముఖుని రాణిని… వాణిని.. నే సరస్వతిని…!
    నువ్వుకడుపులో పడాగానే మా అన్నయ్య నన్నయ పుట్టింటికి తీసికెళ్ళాడు.
    అక్కడ వ్యాసులు తాతయ్య పరగడుపునే భారతం చదివేవాడు. వాల్మీకి తాతయ్య రాత్రిళ్ళు రామాయణం           వినిపించేవాడు.. ఒకటి తేనెవాక, మరొకటి వెన్నెలరేక.. పంచవాయిద్యాలు .. షడ్రుచులు.. సప్తవర్ణాలు .. అష్ట              భోగాలతో… నవరసాలతోటే నవమాసాలు నిండాయి.
    సరిగ్గా మీ పెద్దన్నయ్య కాళిదాసు ‘ కుమార సంభవం’ పూర్తి చేసాడు.. నువ్వు పుట్టావు. మరో అన్న.. భవభూతి            శివుడికి అభిషేకం చేసి విభూతి తీసుకొచ్చి నీ నుదిటిన బెట్టి చిటికెడు నోట్లో కూడా వేసాడు. మీ మేనత్త మొల్ల చల్ల        చిలికి నీ చేతిలో వెన్న పూస పెట్టేది. మీ చిన్నన్న పోతన్న మందార మకరందాన్ని నీ నాలిక్కి రాసేవాడు. నువ్వు                నడకంతా శ్రీనాధుడి దగ్గర నేర్చుకున్నావు. అంచేతే నీ పాదాల్నిండా అల్లరి. .
    యవ్వనం వచ్చింది.. పువ్వులకోసం దేవుళ్ళాడ్డాం మొదలైంది. దేవులపల్లితో నేస్తం కట్టావు. శ్రీ శ్రీ ని ఆవహించుకొని        కలాన్ని కత్తిలా సానబట్టావు. గురజాడ నించి ముత్యాల స్వరాలు.. చిలకమర్తి నుంచి కంఠాభరణం సొంతం                    చేసుకున్నావు. అలాగే విశ్వనాధ నుంచి మిరియాలు, పానుగంటి నుంచి శొంఠీ వంట బట్టించుకున్నావు.

    -- వేటూరికి సన్మానపత్రం, తనికెళ్ళ భరణికి సరస్వతీదేవి స్వయానా చెవిలో చెప్పిందట

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి