ఛటచ్ఛట
జులై 19, 2022
ఛటచ్ఛట (chhaṭa-chhaṭa)
అర్థము
(క్రియావిశేషణము): ఛట=కాంతి; కాంతివంతంగా; ప్రజ్వలించు; భగభగ; ఉగ్రంగా; తీవ్రోష్ణత
Meaning
(adverb) : brightly; hotly; fiercely
వాడుక / Usage
పరివ్యాప్తమైన అంతరిక్ష కాంతిమేఘ ఛటచ్ఛటాగ్నితో ఛిన్నమయ్యె అనేక ఖండాలుగా.
The light ball in the all encompassing space exploded fiercely into many pieces.
మెదడుకు మేత / Food for thought
అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెస్తాడు
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళల్లో
ఆకాశ చిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది
వద్దు...
నాకు వెన్నెలా వద్దు, పున్నమీ వద్దు
సూర్యుడొక్కడు చాలు
అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ...
అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పాటల్ని వెంట తెస్తాడు
అతని సమక్షంలో
పోగొట్టుకున్న బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
శరీరం అనుభవాల పాఠశాల అవుతుంది
నేను అతని గుండెల్లో దాక్కుని పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీరనాదాల్ని తూటాలు వెంటాడిన వైనం చెబుతాడు
అప్పుడు
భయంగా అతన్ని నా గుండెలో దాచుకుంటాను
అతనిప్పుడు లేడు
ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన
ఆకు రాలే కాలానికి ఎక్కడ రాలి పడ్డాడో?
-- ఆకురాలు కాలం, మహెజబీన్
Comments
Post a Comment