నిబిడము
జులై 20, 2022
నిబిడము (nibiḍamu)
అర్థము
(విశేషణము): దట్టము; దృఢము; సాంద్రము
Meaning
(adj) : thick; closely packed; impenetrable
వాడుక / Usage
కాలపురుషుడు సహస్రారమై ఛాయానిబిడ సాగరాల, సుప్తిజాగృతి కారకుడైన భాస్కరుడిని అద్దాడు.
Time spread infinitely across oceans of thick blackness (space), giving the life force that awakens us - Sun.
మెదడుకు మేత / Food for thought
ఎలక్కి బోనూ
చిలక్కి పంజరం
ఎద్దుకు కాడీ
సింహాలకి జూలూ ... (zooలూ)
కుక్కలకి గొలుసూ
చేపలకి పులుసూ ...
అంటే ఈ భూగోళం మొత్తం
మనిషి అబ్బ సొమ్మా!
పిల్లాడికి జ్వరమొస్తే
కోడిపుంజుకు చావా?
ఊళ్ళో కరువొస్తే
మేకల మెడ నరకాలా?
ఈ భూమ్మీద
పండు పుట్టింది
పిట్ట కోసం కాదా?
పండూ - పిట్టా
రెండూ నీకేనా?
ఏనుగు దంతంతో
బుద్ధుడి బొమ్మా?
ఎద్దు కొమ్ముతో
ఏసుక్రీస్తా?
సర్లే!
పులితోలు నీ దేవుడి డ్రస్సూ!
జింకతోలు మీద కూర్చుని
వాడికోసం - నీ తపస్సూ!!
చిలక్కి పంజరం
ఎద్దుకు కాడీ
సింహాలకి జూలూ ... (zooలూ)
కుక్కలకి గొలుసూ
చేపలకి పులుసూ ...
అంటే ఈ భూగోళం మొత్తం
మనిషి అబ్బ సొమ్మా!
పిల్లాడికి జ్వరమొస్తే
కోడిపుంజుకు చావా?
ఊళ్ళో కరువొస్తే
మేకల మెడ నరకాలా?
ఈ భూమ్మీద
పండు పుట్టింది
పిట్ట కోసం కాదా?
పండూ - పిట్టా
రెండూ నీకేనా?
ఏనుగు దంతంతో
బుద్ధుడి బొమ్మా?
ఎద్దు కొమ్ముతో
ఏసుక్రీస్తా?
సర్లే!
పులితోలు నీ దేవుడి డ్రస్సూ!
జింకతోలు మీద కూర్చుని
వాడికోసం - నీ తపస్సూ!!
-- పరికిణి (కవితా సంకలనం), తనికెళ్ళ భరణి
Comments
Post a Comment