పరివృతం
జులై 21, 2022
పరివృతం (pari-vritamu)
అర్థము
(విశేషణము): చుట్టబడినది; పొందబడినది; తెలుసుకున్నది; వృత్తం
Meaning
(adj) : encompassed; surrounded; pervading; encircled
వాడుక / Usage
"ఓంకార పరివృతం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం"
The first sound, Om, pervades the universe; observable universe is limited by our imagination.
మెదడుకు మేత / Food for thought
లంకా దహనం బప్పు డహంకృతు, డరి గర్వ మణచ హనుమ యొనర్చెన్!
లంకను దహించి రిప్పుడు, లంకా ప్రజలె అసమర్థ ప్రభువును దింపన్!
ఆర్థిక దుస్థితినిన్ – పరమార్థ మనో వికసనమ్మె అగుపించె ప్రజన్!
అర్థం బమరు ..! వెడలు …! నిస్వార్థ జన హిత స్ఫురణము జనులకు మేలౌ!
నూతన పాలకు డిక ‘జనచేతనము’ ను మదిని నిల్పి, సేయు సమృద్ధిన్!
ఏ తరమున, నెవరి కయిన, ఈ తత్త్వము బోధపడుట ఎంతయొ హితమౌ!

-- డా. ఆచార్య ఫణీంద్ర
Comments
Post a Comment