ఉల్లంఘనము

 

జులై 25, 2022

ఉల్లంఘనము (ul-langhanamu)

    అర్థము

   (విశేష్యము): దాటుట; మీరుట; అతిక్రమించుట 

   Meaning

   (noun) : transgression, violation, cross, jump

   వాడుక / Usage

  జాతీయత పేరుతో పౌరహక్కుల ఉల్లంఘన పరిపాటి అయిపొయింది.
  Violation of citizens rights under the guise of nationalism has become common.

   మెదడుకు మేత / Food for thought

సింహాసీనుడైన ప్రభువు మరీ మెత్తగా కనిపిస్తే మత్తేభం మీద కెక్కి మావటీడు అంకుశంతో లొంగతీసినట్లు రాజును ప్రజలు వంచుతారు. అంత మాత్రాన మృదువర్తనం విడిచి నిరంతరం క్రూర చిత్తంతో ప్రవర్తిస్తే సుఖశాంతులు లోపించి ప్రజానీకం తిరగబడి వేటాడుతారు. ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంతగా ఆ దారిని అనుసరించాలి. వసంతవేళ సూర్యుడు చురుకుమనిపిస్తాడు. సాయంత్రానికి చల్లగా ఉంటాడు. అదీ రాజుకు ఆదర్శం. రాజు దేహం ప్రజలు - ప్రజలకు ఆత్మ రాజు - ఇదీ వీని అన్యోన్యానుబంధం. 

-- భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఉపదేశం, శాంతి పర్వం, ఉషశ్రీ (మార్చ్ 6, 1928 - 1990) మహాభారతం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి